News August 22, 2025

ఇన్ స్పైర్ నామినేషన్లు గడువులోగా పూర్తి చేయాలి: డీఈవో

image

ఇన్ స్పైర్ నామినేషన్లను గడువులోగా పూర్తి చేయాలని మెదక్ డీఈఓ రాధా కిషన్ సూచించారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుదర్శనమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏఎస్ఓ నవీన్ కలిసి అన్ని మండలాల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వర్చువల్ పద్ధతిలో అవగాహన కల్పించారు. నామినేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ద్వారా విద్యార్థుల నూతన ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావాలని తెలిపారు.

Similar News

News August 22, 2025

మెదక్: ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పెంపు

image

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్‌ అధికారి మాధవి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా తమకు నచ్చిన కళాశాలలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు.

News August 21, 2025

మెదక్ జిల్లా ఖజానా శాఖ ఏడీగా అనిల్ కుమార్ బాధ్యతలు

image

మెదక్ జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులుగా(ఏడీ) అనిల్ కుమార్ మరాటి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అంతకుముందు కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ట్రెజరీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బందితో సమన్వయంగా విధులు నిర్వహిస్తానని అనిల్ తెలిపారు. ఎస్టీఓ వేణుగోపాల్, జూనియర్ అకౌంటెంట్ యాదగిరి తదితరులున్నారు.

News August 21, 2025

మెదక్: జిల్లాలో ఇంకా నిండని సగం చెరువులు

image

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు సగం చెరువులు మాత్రమే అలుగు పారుతున్నాయని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో మొత్తం 2,632 చెరువులున్నాయని, అందులో 25-50 % 63, 50-75% 290, 75-100% 705 చెరువులు నిండాయన్నారు. 1574 చెరువులు అలుగులు పారుతున్నాయని వివరించారు. మెదక్ ప్రాంతంలో ఇంకా చెరువుల్లోకి నీరు రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.