News August 22, 2025
HYDలో ‘Go Back’ స్లోగన్స్.. మీ కామెంట్?

HYD వేదికగా ‘మార్వాడీ గో బ్యాక్’ స్లోగన్స్ చేస్తూ.. నేడు TG బంద్‌కు OU JAC పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. మరో ఉద్యమం మొదలైందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదానికి INC, BJP దూరంగా ఉన్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా సిటీలో మార్వాడీలు స్థిరపడ్డారని, కలిసి మెలిసి ఉంటున్న సమయంలో కొత్తగా ఆందోళన ఏంటని కొందరు పెదవి విరిస్తున్నారు. మరి ‘గో బ్యాక్’ నినాదంపై మీ కామెంట్?
Similar News
News August 22, 2025
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 32 ఎజెండా అంశాలు, 7 టేబుల్ అంశాలకు ఆమోదం లభించింది. ముందుగా రామంతాపూర్ కృష్ణాష్టమి విషాదంలో బాధితులకు మౌనం పాటించి సంతాపం తెలిపారు. వెండింగ్ షాపుల టెండర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, ఎల్ఈడీ లైట్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. ఈ నిర్ణయాలతో నగరవాసులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
News August 21, 2025
పాట్ మార్కెట్ ఘటనకు మార్వాడీలకు సంబంధం లేదు: సాయి

మోండా మార్కెట్ PS పరిధిలో జులై 30న జరిగిన ఘటనలో పాట్ మార్కెట్ మార్వాడి వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు సాయి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ రోజు తనకు, ఎస్కే జ్యువెల్లర్స్ వ్యాపారుల మధ్యనే వివాదం జరిగిందన్నారు. రోడ్డుపై హారన్ కొట్టడంతో జరిగిన వివాదం SC, ST కేసు వరకు వెళ్లగా, కొందరు తమ మధ్య జరిగిన గొడవను పాట్ మార్కెట్ వ్యాపారుల అందరితో కలిపి ముడి పెట్టారన్నారు.
News August 21, 2025
HYD: తాను చనిపోతూ ఏడుగురికి పునర్జన్మ

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణాలు పోశాడు. మియాపూర్‌కు చెందిన కృష్ణ సుమంత్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. AUG 18న విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై, ఆస్పత్రిలో చేరాడు. బుధవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. జీవన్‌దాన్ వారు కృష్ణ తండ్రితో మాట్లాడి గుండె, కిడ్నీలు, లివర్, లంగ్స్, కళ్లు దానం చేయమన్నారు. అవయవదానం చేసి కృష్ణ ఏడుగురికి పునర్జన్మ ఇచ్చాడు.