News August 22, 2025
గణేష్ విగ్రహాలకు సింగిల్ విండో అనుమతులు: ఎస్పీ

పబ్లిక్ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించుకునే వారు “సింగిల్ విండో” విధానం ద్వారా అనుమతులు పొందవచ్చని ఎస్పీ తుషార్ డూడి గురువారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ganeshutsav.net అనే వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టిందని, దీని ద్వారా సులభ పద్ధతిలో అనుమతులు తీసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News March 17, 2026
WGL: స్తంభించిన రియల్ ఎస్టేట్..!

ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ కొంతకాలంగా మందగమనంలో సాగుతోంది. రెండేళ్లుగా క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గిపోవడంతో అటు వ్యాపారులు, ఇటు రిజిస్ట్రేషన్ శాఖ ఆందోళన చెందుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే, 2024లో 1,05,834 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 2025లో 1,03,784, 2026లో ఇప్పటివరకు 19,146 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. గతంలో రోజుకు సగటున 170 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ప్రస్తుతం 40 కూడా దాటడం లేదు.
News March 17, 2026
పల్నాడు: యువతి కిడ్నాప్ కలకలం.. పోలీసుల ఛేజింగ్‌తో సురక్షితం!

రొంపిచర్ల మండలం తుంగపాడులో యువతి కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువతిని బైకులపై వెంబడించిన దుండగులు అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టారు. అన్నారం వద్ద నిందితుల వాహనాలను స్వాధీనం చేసుకోగా.. పోలీసుల సాయంతో యువతి సురక్షితంగా స్టేషన్‌కు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News March 17, 2026
కొడంగల్ ఎత్తిపోతలపై సీఎం స్పెషల్ ఫోకస్

సొంత నియోజకవర్గ దాహార్తిని తీర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. దాదాపు రూ.4,885 కోట్ల నిధులతో ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా 10 రిజర్వాయర్లను నిర్మించనున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుపై సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


