News August 22, 2025
‘సత్వర గుర్తింపుతో క్యాన్సర్ బారి నుంచి తప్పించవచ్చు’

సత్వర గుర్తింపుతో క్యాన్సర్ బారి నుంచి తప్పించవచ్చు పార్వతీపురం DMHO భాస్కరరావు అన్నారు. ఎన్సీడీ 4.0లో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్‌పై వైద్యాధికారులు, సిబ్బందికి గురువారం ఎన్జీఓ హోంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. గైనకాలజిస్ట్, డెంటల్ వైద్యులకు క్యాన్సర్ స్క్రీనింగ్‌పై పవర్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ అందించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 17, 2026
NZB: హనుమాన్ జయంతి వేడుకల అనుమతి ఇవ్వాలి: VHP

ఏప్రిల్ 2న జిల్లాలోని NZB, బోధన్, ఆర్మూర్‌లలో నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకులు కోరారు. NZB CP సాయి చైతన్యను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో VHP విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్ దాత్రిక రమేశ్, హిందూవాహిని జిల్లా సంయోజక్ దాసరి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News March 17, 2026
సెక్రటేరియట్ టవర్స్: AC, ఎలక్ట్రికల్, పంబ్లింగ్ వర్క్స్‌కు రూ.2316 కోట్లు

AP: అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ టవర్స్‌లో హైసైడ్ ఎలక్ట్రికల్, HVAC, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్, ఫైర్ అలారమ్, పంబ్లింగ్ తదితర పనులకు రూ.2316.88 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం CRDAకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ GO ఇచ్చింది. GAD టవర్‌తో పాటు 1, 2, 3, 4 టవర్లలోని సదరు పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. 53L చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ టవర్లను నిర్మిస్తున్నారు.
News March 17, 2026
గద్వాల్: పోలీస్ క్రీడల్లో జోగుళాంబ జోన్ జోరు.. 40 పతకాలు కైవసం

సైబరాబాద్‌లో జరిగిన 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జోగుళాంబ జోన్ (Zone-VII) అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 40 పతకాలు (14 స్వర్ణ, 10 రజత, 16 కాంస్య) సాధించి జోన్ సత్తా చాటింది. మంగళవారం మహబూబ్‌నగర్‌లో విజేతలను జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు ఉమ్మడి జిల్లా ఎస్పీలు, పోలీస్ అధికారులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.


