News August 22, 2025

MNCL: బాలసదనం పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నస్పూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం భవన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం ఆయన బాలసదనం భవనాన్ని పరిశీలించారు. మిషన్ వాత్సల్య నిధుల నుంచి రూ.1.34 కోట్లతో చేపట్టిన ఈ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

Similar News

News March 5, 2026

నెలకు రూ.40వేల జీతం.. ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

ముంబై పోర్ట్ అథారిటీ 10 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. బీకామ్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News March 5, 2026

సచిన్‌లాగే అర్జున్.. వయసులో పెద్ద అమ్మాయితో వివాహం!

image

సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ఈరోజు ముంబైలో జరగనుంది. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన సానియా చందోక్‌ను ఆయన పెళ్లాడనున్నారు. సానియా కంటే అర్జున్ ఒక సంవత్సరం చిన్నవాడు కావడం గమనార్హం. అర్జున్ 1999 SEP 24న, సానియా 1998 జూన్ 23న జన్మించారు. ఈ నేపథ్యంలో వీరి వయసు వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. కాగా అర్జున్ పేరెంట్స్ సచిన్(52), అంజలి(58) మధ్య వయసు తేడా ఆరేళ్లు. 1995లో వారికి వివాహమైంది.

News March 5, 2026

విజయవాడలో IAS అని నమ్మించి.. రూ.10 లక్షల మోసం

image

రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానంటూ కానూరుకు చెందిన నాగమణిని మురళి అనే వ్యక్తి భారీగా మోసం చేశాడు. తాను ఐఏఎస్ అధికారిగా సెలక్ట్ అయ్యానని నమ్మించి, పలు దఫాలుగా ఆమె నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో బాధితురాలు కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మురళిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.