News August 22, 2025

గణేశ్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోండి: ఎస్పీ

image

అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా గణేశ్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ పి.జగదీశ్ తెలిపారు. జిల్లాలో వినాయక ఉత్సవాల అనుమతుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ganeshutsav.net అనే వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాలని సూచించారు. అనుమతి పత్రంలో సూచించిన నిబంధనలను తప్పక పాటించాలన్నారు.

Similar News

News August 22, 2025

M.Tech, M.Pharmacy పరీక్షా ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTUలో జులైలో నిర్వహించిన M.Tech 1, 2, 3వ సెమిస్టర్ల, M.Phamarcy 1, 2, 3వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ విడుదల చేశారు. విద్యార్థులు https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చూసుకోవచ్చన్నారు.

News August 22, 2025

బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

శ్రీకృష్ణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల బీపీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను పరీక్షల విభాగంలో డైరెక్టర్ జీవి రమణ, కంట్రోలర్ శ్రీరామ్ నాయక్, అసిస్టెంట్ రిజిస్టార్ శంకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలాజీ నాయక్ గురువారం ప్రకటించారు. మొత్తం 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 60 మంది ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు. ఫలితాల కోసం ఎస్కేయూ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.

News August 21, 2025

‘అనంతపురం ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు’

image

ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యే వర్గీయులు తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, ఆడియో కాల్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ధనుంజయ నాయుడు ఆరోపించారు. దగ్గుబాటి ప్రసాద్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని, ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.