News August 22, 2025

డ్రగ్ సంబంధిత సమాచారం ఇవ్వండి: వరంగల్ సీపీ

image

డ్రగ్స్ సంబంధిత సమాచారం ఇవ్వడానికి 1908కు కాల్ చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ప్రజలను కోరారు. ఎవరైనా డ్రగ్స్ వ్యాపారం, వాడకం లేదా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చేవారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సమాజాన్ని డ్రగ్స్ నాశనం చేస్తాయన్నారు.

Similar News

News March 9, 2026

మదనపల్లెలో ఒంటినిండా రక్తంతో వీరంగం సృష్టించాడు

image

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఒంటినిండా రక్తంతో హల్ చల్ చేశాడు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై అనుచితంగా ప్రవర్తించాడు. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని అతని నివారించే ప్రయత్నం చేశారు. పోలీసులపై కూడా బూతులు మాట్లాడాడు. మద్యం మత్తులోనే ఇలా చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

News March 9, 2026

స్కూళ్లు, హాస్టళ్లలో స్టీమ్ రైస్ అన్నం

image

TG: స్కూళ్లు, హాస్టళ్లలో స్టీమ్ రైస్ అన్నాన్ని వడ్డించాలని GOVT నిర్ణయించింది. ఇప్పుడు పెడుతున్న బియ్యంతో అన్నం ముద్దగా అయి విద్యార్థులు తినడం లేదు. ప్రత్యామ్యాయంగా స్టీమ్ రైస్ అన్నాన్ని కొన్నిచోట్ల పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయించింది. ఈ రైస్ అన్నం ముద్ద కాకపోవడంతో పాటు పోషకాలతో పొడిగా ఉండడంతో వారు ఇష్టంగా తింటున్నారు. దీంతో ఇకపై ఇవే బియ్యాన్ని అన్ని హాస్టళ్లు, స్కూళ్లకు అందించాలని ఆదేశించింది.

News March 9, 2026

యుద్ధ ప్రభావం: 7 గంటల ప్రయాణం తర్వాత ఇండిగో విమానం యూటర్న్

image

ఢిల్లీ నుంచి మాంచెస్టర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం 7గంటల జర్నీ తర్వాత మధ్యలోనే వెనక్కి మళ్లింది. యుద్ధం నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ఎయిర్‌స్పేస్‌లో సడన్‌గా ఆంక్షలు విధించడమే దీనికి కారణం. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్ వంటి దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో ఆఫ్రికా రూట్‌లో వెళ్తుండగా.. అక్కడ కూడా చివరి నిమిషంలో ఆంక్షలు రావడంతో ఢిల్లీకి తిరుగు పయనమైంది.