News August 22, 2025

ప్రకాశం: ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌కు దరఖాస్తుల ఆహ్వానం!

image

జిల్లాలో హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈనెల 27లోగా సమర్పించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఒక సంవత్సరం కాల పరిమితి గల లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా శిక్షణ అందుతుందన్నారు. ఎస్సీ అభ్యర్థులు అర్హులని, ఇతర వివరాలకు ఎగ్జిక్యూటివ్ అధికారి నంబర్ 9849905970 ను సంప్రదించాలన్నారు.

Similar News

News August 23, 2025

ప్రకాశం జిల్లాలో 47200 అర్జీల పరిష్కారం

image

ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన 47200 అర్జీలను పరిష్కరించినట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వివరించారు. ప్రజల అర్జీల పరిష్కారంపై ఒంగోలులోని కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించేలా, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 22, 2025

భూగర్భ జలాలు పెరిగేలా ప్రణాళికల తయారీ: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భూగర్భ జల వనరులశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 20 మీటర్లకంటే ఎక్కువ భూగర్భ జలమట్టం ఉన్న గ్రామాల్లో, జలమట్టం పెరిగే అవకాశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు.

News August 22, 2025

ప్రకాశం: భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త

image

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. భార్య రామలక్ష్మమ్మను భర్త వెంకటేశ్వర్లు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.