News August 22, 2025

ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి

image

ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబును గురువారం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆహ్వానం పలికారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఎంకి స్వాగతం పలికారు. ఎంపీని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు.

Similar News

News March 16, 2026

నెల్లూరు: అనాధ శిశువు గురించి ఎవరికైనా తెలుసా ?

image

ఫోటోలోని అనాధ మగ శిశువును శిశు గృహ నందు సంరక్షణలో ఉన్నట్లు ICDS PD హేనా సుజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిశువును జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రచురణ తేదీ నుంచి 30 రోజులలోగా తగిన సాక్ష్యాధారాలతో సహా ICDS PDని సంప్రదించాలని కోరారు. లేని పక్షంలో శిశువును అనాథ శిశువుగా ప్రకటిస్తామన్నారు. అలాగే ప్రభుత్వంచే నిర్దేశించబడిన నియమ నిబంధనల ప్రకారము దత్తతకు ఇవ్వడం జరుగుతుందన్నారు.

News March 16, 2026

టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. సోమవారం నగరంలోని సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో టెన్త్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఈవో బాలాజీ రావు పరిశీలించారు. పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని డీఈఓకు సూచించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

News March 16, 2026

నెల్లూరు : మరి కాసేపట్లో మొదలుకానున్న పది పరీక్షలు

image

10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో మొదలుకానున్నాయి. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 174 కేంద్రాలలో 28,589 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 24 సిట్టింగ్ స్క్వార్డులు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షను పర్యవేక్షించనున్నారు. పరీక్షల్లో సమస్యలు ఎదురైతే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.