News August 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 22, 2025
నేడు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

తెలంగాణలో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఏపీలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
News August 22, 2025
EPFOలో 230 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి. <
News August 22, 2025
పీడిస్తున్న విష జ్వరాలు.. పెరుగుతున్న బాధితులు!

TG: వర్షాలు, వరదల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఓపీ కోసం ఆస్పత్రులకు వెళ్తున్న వారి సంఖ్య 30% పెరిగింది. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు సమాచారం. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నడుము నొప్పి, ఒంటిపై దద్దుర్లు, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.