News August 22, 2025
ఆగస్టు 22: చరిత్రలో ఈరోజు

1922: చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి
1932: నృత్యకారుడు, నటుడు గోపీకృష్ణ జననం
1955: మెగాస్టార్ చిరంజీవి జననం
1984: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు మరణం
1989: గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ జననం
2014: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అనంతమూర్తి మరణం
* ప్రపంచ జానపద దినోత్సవం
Similar News
News August 22, 2025
GST: ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే!

5% <<17473121>>GST<<>> శ్లాబ్: టూత్ పేస్ట్, చిప్స్, జామ్, జ్యూస్, పాస్తా, నూడిల్స్, వెన్న, నెయ్యి, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు.
18%: TV, కంప్యూటర్, ఫర్నీచర్, వాషింగ్ మెషీన్స్, వాటర్ ఫిల్టర్స్, కుట్టు మెషీన్లు, ఎలక్ట్రానిక్స్.
40% స్పెషల్ శ్లాబ్: పొగాకు ఉత్పత్తులు, ఆన్‌లైన్ గేమింగ్, బీర్, లగ్జరీ ఐటమ్స్.
ఆహారం, అత్యవసర మందులు, విద్యకు 0% కొనసాగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ని కూడా ఇందులోకి తెచ్చే అవకాశం ఉంది.
News August 22, 2025
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు: చిరంజీవి

పవన్ <<17475204>>బర్త్‌డే విషెస్<<>>కు చిరంజీవి ఎమోషనల్ రిప్లయ్ ఇచ్చారు. ‘తమ్ముడు కళ్యాణ్ నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేనూ అంతే ఆస్వాదిస్తున్నా. నీ వెనుకున్న కోట్లాదిమంది జనసైనికులను ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. నా ఆశీర్వచనాలు నీతోనే ఉంటాయి. ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నా’ అని పోస్ట్ చేశారు.
News August 22, 2025
చిరంజీవి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి: CM చంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవికి AP CM చంద్రబాబు X వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చిరంజీవి గారికి 70వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితంలో మీ అద్భుతమైన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. దాతృత్వం, అంకితభావంతో మీరు ఇలాగే చాలా మంది జీవితాలను స్పృశించడం కొనసాగించాలి. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, రాబోయే ఏళ్లు మరింత చిరస్మరణీయం కావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.