News August 22, 2025
Way2News కథనానాకి స్పందన.. వెలిగిన జనగామ బ్రిడ్జి లైట్లు

‘గాండాంధకారంగా జనగామ బ్రిడ్జి’ అనే శీర్షికతో ఇటీవల Way2News ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. సంవత్సరం నుంచి లైట్లు సరిగా వెలగకపోవడంతో ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. దీంతో వార్త ప్రచురించగా.. కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. బ్రిడ్జిపై ఉన్న లైట్లకు మరమ్మతులు చేయించి లైట్లు వెలిగేలా చేశారు. స్థానికులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 28, 2026
NZB: నగర పాలక సంస్థ 2026-2027 బడ్జెట్‌కు ఆమోదం

నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన అంచనా వ్యయం రూ. 24700.60 లక్షల బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం కౌన్సిల్ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2025 – 2026 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
News March 28, 2026
MBNR: ఈ నెల 31న భారీ ఉద్యోగ మేళా

మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో మార్చి 31న ఉదయం 10:30 గంటలకు పిల్లలమర్రి రోడ్డులో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి ఆపై చదివిన 18-30 ఏళ్ల యువత 500 ఖాళీల భర్తీకి అర్హులని జిల్లా అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని, వివరాలకు 89193 80410 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
News March 28, 2026
చిత్తూరు: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు

జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ శనివారం హెచ్చరించారు. ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకోసం పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా బెట్టింగ్లకు పాల్పడితే 112, 9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


