News August 22, 2025
KMR: భర్త హత్య.. భార్య, ప్రియుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడింది. SP రాజేశ్ చంద్ర వివరాలు.. దేవునిపల్లికి చెందిన షబ్బీర్‌పై మిస్సింగ్ కేసు నమోదైంది. మరుసటి రోజు తాడ్వాయి(M) కన్కల్లో అతని శవం దొరికింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ప్రియుడు హన్మంతుతో కలిసి భర్తను చంపించినట్లు నసిమా పోలీసుల విచారణలో ఒప్పుకొంది. వారిని KMR కోర్టులో హాజరుపరచగా జడ్జి జీవిత ఖైదు శిక్షతో పాటు, ఫైన్ విధిస్తూ తీర్పు ఇచ్చారు.
Similar News
News March 19, 2026
మంచిర్యాల: తండ్రి మందలించాడని వర్షిత సూసైడ్

తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 2-టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సుభాష్ నగర్‌కు చెందిన వర్షిత(17) తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చింది. ఇంట్లో చెప్పకుండా డబ్బులు అప్పు ఇవ్వడం ఏంటని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కేసు నమోదైంది.
News March 19, 2026
మూడో బిడ్డకు జన్మనిచ్చిన దినేశ్ కార్తీక్ దంపతులు

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య, స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి ‘రాహా పల్లికల్ కార్తీక్’గా పేరు పెట్టినట్లు DK తెలిపారు. వీరికి 2021లో కవల మగ పిల్లలు కబీర్, జియాన్ జన్మించిన విషయం తెలిసిందే. కాగా కార్తీక్ 2007లో నిఖితను వివాహం చేసుకోగా 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2015లో దీపికాను పెళ్లాడారు.
News March 19, 2026
MBNR: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఉచిత బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68,288 అంత్యోదయ కార్డులు, 10,24,472 ఆహార భద్రత కార్డులు ఉన్న లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.


