News August 22, 2025

సంగారెడ్డి: ఈనెల 31 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్

image

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్లకు అపరాధ రుసుముతో ఈనెల 31 వరకు అడ్మిషన్ పొందవచ్చని జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి గురువారం తెలిపారు. రెగ్యులర్ ఫీజుతో పాటు పదో తరగతికి వంద రూపాయలు , ఇంటర్మీడియట్‌కి రూ. 200 అపరాధ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News August 22, 2025

గూడూరు: రౌడీషీటర్‌కు లెటర్లు ఇవ్వడం ఏంటి?

image

నెల్లూరు రూరల్, గూడూరు MLAలు కోటంరెడ్డి, సునీల్ కుమార్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. శ్రీకాంత్ పెరోల్‌కు తాము ఇచ్చిన సిఫార్స్ లెటర్లు తిరస్కరించారని.. ఆ వివాదంతో తమకు సంబంధం లేదని MLAలు అంటున్నారు. లెటర్లు రిజెక్షన్ సరే.. అసలు జైలు నుంచి నేరస్థుడిని విడుదల చేయడానికి సిఫార్స్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. మంచి పనులకు లెటర్లు ఇవ్వాల్సిన MLAలు రౌడీషీటర్ కోసం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

News August 22, 2025

జానపదాల ఖిల్లా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా

image

జానపద కళలకు, పాటలకు, కళాకారులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కేంద్రంగా నిలిచిందనడంలో సందేహం లేదు. పల్లెల్లో ప్రతి మాటలోనూ, యాసలోనూ ఓ పాట వినిపిస్తుంది. అందుకే ఇక్కడి పాటలు, పల్లె పదాలు ప్రజల మనసులను సులభంగా ఆకట్టుకుంటాయి. జానపదాలతో పేరు ప్రఖ్యాతులు పొందిన వారిలో మధుప్రియ, మౌనిక, మాట్ల తిరుపతి, సుమన్, శిరీష, గడ్డం రమేష్, దిలీప్, శ్రీనిధి వంటి ప్రముఖ కళాకారులు ఉన్నారు.
# నేడు ప్రపంచ జానపద దినోత్సవం

News August 22, 2025

NZB: సీసీ కెమెరాలపై స్ప్రే.. ATMలో చోరీకి యత్నం

image

నిజామాబాద్ చంద్ర శేఖర్ కాలనీలో ఈనెల 18న అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేయగా అందులో ఉన్న నగదు కాలిపోయింది. దుండగులు ఏటీఎంలోని సీసీ కెమెరాలపై స్ప్రే చేసి ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.