News August 22, 2025

నంద్యాల: రక్తంతో చిరంజీవి చిత్రం

image

నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శ్రీనివాసులు రక్తంతో చిరంజీవి చిత్రాన్ని గీశారు. ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించు చిత్రాన్ని గీశానని తెలిపారు. సినీ పరిశ్రమలో చిరంజీవిగా ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభించారని తెలిపారు. విశ్వంభర చిత్రం చేస్తూ డాన్సులు, ఫైట్లతో నటనలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.

Similar News

News August 22, 2025

తూప్రాన్: వాట్సాప్ లింక్‌తో.. రూ.25 లక్షల మోసం

image

వాట్సాప్ లింక్‌తో వ్యక్తి రూ.25 లక్షలు మోసపోయిన ఘటన తూప్రాన్ మండలంలో జరిగింది. సీఐ రంగకృష్ణ తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు వచ్చిన లింక్ ఆధారంగా ఒక నకిలీ షేర్ మార్కెట్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో పెట్టుబడుల రూపంలో దాదాపు రూ.25 లక్షల వరకు జమ చేశాడు. మోసపోయినట్లు గ్రహించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 22, 2025

కొయ్యూరు: టీఏ, కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్

image

కొయ్యూరు మండలంలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రభాకర్, కంప్యూటర్ ఆపరేటర్ కుమారిని సస్పెండ్ చేశామని డ్వామా పీడీ డీవీ విద్యాసాగర్ తెలిపారు. గతంలో వారు చింతపల్లి మండలంలో విధులు నిర్వహించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

News August 22, 2025

HYD: గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా? ఇవి కంపల్సరీ

image

గణపతి నవరాత్రుల్లో మండపాలకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీనుకోవాలి. https://policeportal.tspolice.gov.in/index.htmలో పర్మిషన్‌‌కు అప్లై చేయండి.
☞ విద్యుత్ కనెక్షన్‌కు డీడీ తీసుకోవాలి
☞ స్వతంత్రంగా కరెంట్ కనెక్షన్ ఇవ్వొద్దు
☞ నిపుణులతో గాలి, వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోండి
☞ స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోండి
☞ అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమచారం ఇవ్వండి.