News August 22, 2025
‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం.. నేడు బంద్

TG: స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ బంద్‌కు OU JAC పిలుపునిచ్చింది. మార్వాడీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు బంద్‌కు సహకరించాలని కోరింది. కాగా ఈ బంద్‌కు పలు జిల్లాల్లో వ్యాపారులు, పలు సంఘాల నాయకులు మద్దతిచ్చారు. నల్గొండ, వరంగల్, జనగామ, దేవరకొండ సహా పలు ప్రాంతాల్లో షాపులు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Similar News
News March 16, 2026
FLASH: తగ్గిన బంగారం ధర

బంగారం ధర క్రమంగా దిగొస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.490 తగ్గి రూ.1,59,170కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,45,900 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 16, 2026
గంట మోగించేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తిరిగి వచ్చేటప్పుడు కొట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో పట్టుకుని లయబద్ధంగా మోగించాలి. అనవసరంగా, పదేపదే కొట్టకూడదు. 2,3 సార్లు స్పష్టంగా మోగించడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో గంటను బిగ్గరగా మోగించకూడదు. ఈ నియమాలను పాటిస్తే దేవతల ఆవాహన జరగడమే కాకుండా, ఆ ప్రతిధ్వని ద్వారా మనసు ఏకాగ్రతను పొంది ఇంట్లో సానుకూల ప్రకంపనలు వ్యాపిస్తాయి.