News August 22, 2025

షెడ్యూల్ కులాల యువకులకు హెవీ డ్రైవింగ్ పై శిక్షణ: ముక్కంటి

image

షెడ్యూల్ కులాలకు చెందిన యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని ఎస్సీ ఈడీ ముక్కంటి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 27 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. శిక్షణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభిస్తామన్నారు. ఎస్సీ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని, పూర్తి చేసి అక్కడే సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు నం: 8019684966 సంప్రదించాలన్నారు.

Similar News

News March 14, 2026

ప.గో: మహిళపై లైంగిక వేధింపులు.. మూడేళ్ల జైలు

image

జంగారెడ్డిగూడెం మండలంలోని ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ఉండ్రాజవరపు శివకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది జులైలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆర్పీవీఎస్ మురళీకృష్ణ.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో నెల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.

News March 14, 2026

కామారెడ్డి: ఆర్టీసీ బస్సుల్లో పది విద్యార్థులకు బంపర్ ఆఫర్!

image

కామారెడ్డి జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆర్టీసీ విద్యార్థులకు భారీ ఊరటనిచ్చింది. విద్యార్థులు చేయి ఎత్తిన చోట బస్సులు ఆపాలని, వారిని పరీక్షా కేంద్రాల వద్ద దించాలని డ్రైవర్లు, కండక్టర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News March 14, 2026

WGL: చికెన్ ధరలు… కిలో రూ.300 దాటింది

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేసవి ప్రభావంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో చికెన్ కిలో ధర రూ.300 దాటగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.320 వరకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజులుగా ధరలు రూ.280 కంటే తగ్గడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. వేసవి తీవ్రతతో కోళ్లు చనిపోవడం వల్ల ఫాముల్లో ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు.