News August 22, 2025

EPFOలో 230 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

image

EPFOలో 230 ఉద్యోగాల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. లెవెల్-8, లెవెల్-10 వేతన శ్రేణి కింద జీతాలు అందుతాయి. <>https://upsconline.nic.in <<>>సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News March 25, 2026

పొదుపులో మహిళలు మహారాణులే.. కానీ!

image

డబ్బు దాచడంలో భారత మహిళలు ముందున్నా పెట్టుబడుల విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70%మంది మహిళలు పొదుపు చేస్తున్నారు. అయితే ఇందులో 40%మంది మాత్రమే FD, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులపై కాకుండా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవగాహన లేకపోవడం, నష్టభయం వల్ల చాలామంది వీటికే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది తమ ఆదాయంలో 10% కంటే తక్కువ పెట్టుబడి పెడుతున్నారట.

News March 25, 2026

ఇందిర అంటే గౌరవమే.. తప్పేమీ మాట్లాడలేదు: రాకేశ్ రెడ్డి

image

TG: అసెంబ్లీలో ఇందిరపై తన <<19474706>>వ్యాఖ్యల<<>> పట్ల దుమారం రేగడంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘ఇందిరా గాంధీ ఉక్కుమహిళ, ఆమె అంటే మాకు గౌరవమే. నేను తప్పేమీ మాట్లాడలేదు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇప్ప సారా తయారుచేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పా. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తా. తమాషా చేయొద్దని మంత్రి నన్ను బెదిరిస్తున్నారా?’ అని అన్నారు.

News March 25, 2026

బెంగాల్ దంగల్: TMC పైకి BJP ‘పేస్’ అస్త్రం?

image

టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ త్వరలోనే బీజేపీలో చేరి, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. BJP జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌తో నిన్న ఆయన భేటీ కావడంతో ఈ చర్చ మొదలైంది. అసెంబ్లీ పోరులో అధికార TMCని ఢీకొడుతున్న BJP.. పేస్‌ను అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 2021లో TMCలో చేరిన పేస్ కొన్నాళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు.