News August 22, 2025
శ్రీరామపాదక్షేత్రంలో అద్భుత దృశ్యం

నాగాయలంకలోని శ్రీరామపాదక్షేత్రంలో గురువారం సూర్యాస్తమయం అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. నది అలలు, చల్లటి గాలులు, ఆకాశంలో మెరిసిన సప్త వర్ణాలు భక్తులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో ప్రకృతి సోయగాలను వీక్షిస్తూ అందరూ పరవశించిపోయారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక అనుభూతి ఒకేచోట కలగడంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది.
Similar News
News August 22, 2025
విజయవాడ రైల్వే డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి: MP

విజయవాడ రైల్వే డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు MP కేశినేని శివనాథ్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో జీఎం సంజయ్‌కుమార్‌ను కలిసి లెవల్ క్రాసింగ్ నం. 316, 147, 148, 8 వద్ద తక్షణం ROBs, RUBs నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరారు. అలాగే గేట్‌వే ఆఫ్ అమరావతిగా పేరుగాంచిన కొండపల్లి స్టేషన్‌ను అమృత్ భారత్ 2.0 కింద ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు. జీఎం సానుకూలంగా స్పందించారు.
News August 22, 2025
ప్రకాశం: ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

సెప్టెంబర్ 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్‌యంలు తమ పరిధిలోని ఎంఈఓలకు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. డిప్యూటీ DEOలు 25లోగా వాటిని పరిశీలించి 27న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
News August 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు ఎస్పీ కీలక సూచనలు

సివిల్, APSP కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 25, 26వ తేదీలలో కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్‌తో జతపర్చిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్ సర్టిఫికెట్స్, Annexure-I (Revised Attestation Form) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తీసుకుని రావాలన్నారు.