News August 22, 2025
లోన్ యాప్స్‌నూ బ్యాన్ చేయాల్సిందేనా!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం.. లోన్ యాప్స్ విషయంలోనూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఎక్కువ శాతం వడ్డీ తీసుకోవడమే కాకుండా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వడ్డీ, లోన్ సక్రమంగా చెల్లిస్తున్నా పర్సనల్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సన్నిహితులకు పంపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి యాప్స్‌ను నిషేధించాలంటున్నారు. మీ COMMENT?
Similar News
News March 18, 2026
VZM: దేవాలయాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఉగాది, రంజాన్ పండగలను మతసామరస్యంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు సూచించారు. వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. పండగల సందర్భంగా దేవాలయాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని అధికారులకు బుధవారం ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 18, 2026
ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.
News March 18, 2026
త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


