News August 22, 2025

యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. గురువారం 1500 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.75,000, ప్రసాద విక్రయాలు రూ.8,28,170, VIP దర్శనాలు రూ.2,10,000, బ్రేక్ దర్శనాలు రూ.1,18,500, కార్ పార్కింగ్ రూ.2,50,500, యాదరుషి నిలయం రూ.1,00,206, వ్రతాలు రూ.3,27,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.25,63,924 ఆదాయం వచ్చింది.

Similar News

News March 18, 2026

విశాఖలో మళ్లీ వారికే సీట్లు: బొత్స హామీ

image

కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్పొరేటర్లకు వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అవిశ్వాస సమయంలో ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి తోడుగా ఉన్న వారిని ప్రోత్సహిస్తామని కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. విశాఖలో భూ ఆక్రమణలు పెరిగాయని, కూటమి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

News March 18, 2026

మెదక్ జిల్లాలో ఆసుపత్రి సేవలపై డీసీహెచ్ఎస్ సమీక్ష

image

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాలని డీసీహెచ్ఎస్ డా. శివ్ దయాల్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, కౌడిపల్లి ఆసుపత్రుల వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓపీ, ఐపీ సేవలు, ప్రసవాలు, డయాలసిస్ విభాగాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

News March 18, 2026

3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

image

TG: హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్‌తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.