News August 22, 2025

పెద్దారెడ్డి రాక.. ఇక కష్టమేనా?

image

కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఇప్పట్లో రావడం కష్టమేనన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులతో ఆయన ఆశలు నీరుగారగ, పెద్దారెడ్డిని తాడిపత్రికి దూరం చేయడమే జేసీ లక్ష్యంగా కనిపిస్తోంది. దశాబ్దాల JC కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి పెద్దారెడ్డి రాకతో 2019లో గండిపడింది. ఈ క్రమంలో పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానీయకూడదన్న ఆలోచన ప్రభాకర్‌రెడ్డిలో ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.

Similar News

News August 22, 2025

HYD: సెప్టెంబరు నుంచి 100 రోజుల అక్షరాస్యత ఉద్యమం

image

సెప్టెంబరు నుంచి100 రోజులపాటు అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఉద్యమం ప్రారంభం కానుంది. 15 ఏళ్ల వయసు దాటిన వారి కోసం ప్రత్యేకంగా 16 పాఠాలు ముద్రించి, అక్షర వికాసం కోసం ప్రభుత్వం కృషి చేయనుందని అధికారులు తెలిపారు.

News August 22, 2025

కూకట్‌పల్లి: సహస్ర హత్య.. పోలీసుల అదుపులో బాలుడు

image

సహస్ర హత్య కేసులో పక్క భవనంలో ఉన్న బాలుడే ఈ దారుణానికి వడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బాలుడిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టారు. హత్య జరిగిన కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలల్లోనే ఆ బాలుడు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని విచారణ చేయడంలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను విచారణ అనంతరం తెలియజేస్తామని తెలిపారు.

News August 22, 2025

ఏలూరు జిల్లాలో బీజేపీ నేతలకు కీలక పదవులు

image

ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ నేతలకు పార్టీలో కీలక పదవులు లభించాయి. ఏలూరు నగరానికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, కొయ్యలగూడెంకు చెందిన బొల్లిన నిర్మల కిషోర్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధిష్ఠానం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.