News August 22, 2025

సంగారెడ్డి: పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సన్మానించిన ఎస్పీ

image

వివిధ కేసుల్లో జీవిత ఖైదు పడేలా వాదనలు వినిపించిన పీపీలను ఎస్పీ పారితోష్ పంకజ్ కార్యాలయంలో గురువారం సన్మానించారు. పీపీలు శైలజ, విజయశంకర్ రెడ్డి, సత్యనారాయణ, రాజేశ్వర్, సూర్ రెడ్డిలను అభినందించి రివార్డులు అందించారు. భవిష్యత్‌లోనూ ఇదే విధంగా తమ వాదనలు వినిపించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 16, 2026

ఖమ్మం: బడ్జెట్ సమావేశాలు.. నిధుల మోక్షం కలిగేనా?

image

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, 20న డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు క్యాబినెట్‌లో కీలకం కావడంతో..సీతారామ, పాలేరు జేఎన్‌టీయూ, ఇందిరమ్మ ఇళ్లు, పర్యాటక కారిడార్‌కు నిధులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణకు ఈ బడ్జెట్ ఎంతవరకు ఊతమిస్తుందో వేచి చూడాలి.

News March 16, 2026

గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

image

LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో బుకింగ్ & డెలివరీ సమయంలో ఆటంకాలు రావొద్దంటే వెంటనే eKYC పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. సబ్సిడీ ఆగిపోకుండా, కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇది తప్పనిసరని పేర్కొంది. దీనికోసం1800 233 3555 నంబర్‌కు లేదా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. లేకపోతే మీ ఆయిల్ కంపెనీ యాప్‌ డౌన్‌లోడ్ చేసి ‘Aadhaar FaceRD’ యాప్‌ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చు. SHARE IT

News March 16, 2026

నేడు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన, తేమలేని సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.