News August 22, 2025
గుంటూరు జిల్లాలో ఎరువుల కొరత లేదు

గుంటూరు జిల్లాలో ఎరువులు సంవృద్ధిగా అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఆగస్టు నెలకు యూరియా 7,806 మెట్రిక్ టన్నులు(MT) అవసరం అవ్వగా 11,877 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. DAP 5,785 MTకి 3,756 MT అందుబాటులో ఉన్నాయి. MOP 236 MTకి 757 MT అందుబాటులో ఉన్నాయి. కాంప్లెక్స్ 5,205 MTకి 21,017 MT అందుబాటులో ఉన్నాయి. SSP 1,057 MTకి 1,741 MT అందుబాటులో ఉన్నాయి.
Similar News
News September 5, 2025
టీచర్స్ డే.. మీ అనుభవాలు?

ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం పిల్లలకు మరపురాని వేడుకగా నిలుస్తుంది. ఉదయం విద్యార్థులు స్వయంగా గురువుల వేషధారణలో స్కూల్ కి వచ్చి తరగతులను నిర్వహించేవారు. పాఠశాల ప్రాంగణం నవ్వులు, ఆటపాటలతో మార్మోగేది. బహుమతులు, శుభాకాంక్షలతో గురువులను సత్కరించడం విద్యార్ధులకు ఆనందం. ఈ వేడుకలు గురువు – శిష్య బంధానికి చిహ్నంగా నిలుస్తుంది. మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా COMMENT చేయండి.
News September 5, 2025
సంస్కృత ఉపాధ్యాయుడు నుంచి.. ప్రభుత్వ ఆస్థానకవి వరకు

‘అవధాని శిరోమణి’ బిరుదు అందుకున్న సంస్కృతాంధ్ర విద్వాంసుడు, అనేక భాషలు నేర్చిన పండితుడు చతుష్షష్ఠి కళలన్నీ నేర్చిన మహా మనీషి కాశీ కృష్ణాచార్యులు (1872-1967. గుంటూరు హైస్కూలులో సంస్కృత పండిత పదవిని నిర్వహించారు. 1961లో ఏపీ ప్రభుత్వ ఆస్థానకవి పదవిని చేపట్టి 1967లో మరణించేవరకు కొనసాగారు. 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. మొదటి అష్టావధానం వినుకొండలో జరిగింది.
News September 5, 2025
రెవెన్యూ కల్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు: DEO

గుంటూరు జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు డీఈవో సి.వి రేణుక తెలిపారు. 9 మంది ప్రధానోపాధ్యాయులకు, తత్సమాన కేటగిరీలో 20 మంది స్కూల్ అసిస్టెంట్లకు, 25 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందజేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు.