News August 22, 2025
రాజంపేట: ఆ గుంతలే ముగ్గురి ప్రాణాలు తీశాయి..!

చెయ్యేరు నదిలో ఈతకు వెళ్లి అన్నమాచార్య యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులు నిన్న <<17476899>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఇటీవల బాలరాజుపల్లి వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. అక్కడ ఇసుక తవ్వకాలు చేయడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీనికి తోడు పింఛా డ్యాం గేట్లు ఎత్తడంతో చెయ్యేరులో నది ప్రవాహం పెరిగింది. ఈక్రమంలో విద్యార్థులు గుంతల లోతు అంచనా వేయలేకపోవడంతో అందులో చిక్కుకుని ముగ్గురు చనిపోయారు.
Similar News
News March 20, 2026
మూసీ బడ్జెట్ బాగుంది.. మురికి పోతుందా?

తెలంగాణ బడ్జెట్ 2026-27లో మూసీ పునరుజ్జీవనానికి (CURE) సుమారు ₹1.5 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయాన్ని ప్రకటించారు. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర ₹7,000 కోట్లతో పనులు మొదలవుతున్నాయి. 39 కొత్త ఎస్టీపీలు కడతామని చెబుతున్నా.. పారిశ్రామిక కెమికల్ వ్యర్థాలను అడ్డుకునే కఠిన చట్టాల ఊసే లేదు. కాలుష్యాన్ని ఆపకుండా చేసే ఈ ఖర్చు అంతా “నీళ్ల పాలే” అవుతుందన్నది విశ్లేషకుల హెచ్చరిక. దీనిపై మీ కామెంట్?
News March 20, 2026
గోదావరిలో విజయనగరం విద్యార్థి గల్లంతు

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలో దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.
News March 20, 2026
UPDATE: భద్రాచలం.. ఐదుగురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

భద్రాచలం: గోదావరి నదిలో స్నానానికి దిగి అమరావతిలోని SRM కాలేజీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఐదుగురు <<19432137>>గల్లంత<<>>య్యారు. మొత్తం ఏడుగురు యువకులు నదిలోకి దిగగా, ఉద్ధృతికి అందరూ కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. అభిరామ్(విజయనగరం), శ్రీకర్(భద్రాచలం), తేజ(ఉయ్యూరు), సతీష్(మదనపల్లి), నవదీప్(ఉయ్యూరు) ప్రవాహంలో గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, శ్రీకర్, నవదీప్ మృతదేహాలు లభ్యమయ్యాయి.


