News August 22, 2025
పార్వతీపురం: ‘ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలి’

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దటమే ఉల్లాస్ పథకం ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం.సుధారాణి తెలిపారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఉపాధి హామీ ఎపీవోలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 67,111 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలన్నారు.10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్‌ను నియమించలన్నారు. వాలంటీర్‌లు స్వచ్ఛందంగా పని చెయ్యాలని సూచించారు.
Similar News
News March 14, 2026
నెల్లూరు జిల్లాలో పెరిగిన నూనె ధరలు

యుద్ధ ప్రభావం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వంట నూనె ధరలు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ.10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకు పైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News March 14, 2026
WGL: వారి కోసం పోలీసుల వేట!

గంజాయి స్మగ్లర్ల కోసం పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. WGL కమిషనరేట్‌లో 242 మంది NDPS నిందితులుగా ఉన్నారు. వారి కోసం 3 జోన్ల పరిధిలోని CIల ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి రంగంలోకి దించారు. ఎల్కతుర్తి, గీసుగొండతో పాటు టాస్క్‌ఫోర్సు నుంచి CI, SIలను టీంలుగా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 15 మంది నిందితులను పట్టుకోగా, మిగిలిన వారిని పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో CIలు నిమగ్నమై ఉన్నారు.
News March 14, 2026
మెదక్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

మెదక్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 68 కేంద్రాల్లో 11,247 మంది విద్యార్థులు (5,577 బాలురు, 5,670 బాలికలు) పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


