News August 22, 2025
పార్వతీపురం: హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

SC అభ్యర్థులకు APSRTC డ్రైవింగ్ స్కూల్లో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ ఛైర్మన్, కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ గురువారం తెలిపారు. ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలకు మాత్రమే శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణకు అయ్యే ఖర్చు పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ భరిస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
Similar News
News March 15, 2026
వరంగల్ జిల్లాలో నిబంధనలు బేఖాతరు !

వరంగల్ జిల్లాలో కొన్ని మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులను విక్రయిస్తున్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మి సోమ్ము చేసుకుంటున్నాయి. ఇటీవల హన్మకొండలో మత్తులో ఉన్న యువకులను నార్కోటిక్ పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో కాజీపేటలో ఇలాంటి ఘటనే జరగ్గా, తాజాగా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని ఓ షాపును అధికారులు సీజ్ చేశారు.

బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్ (లేదా) 2mlహెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.