News August 22, 2025
కడప: లవ్ ఫెయిల్.. లవర్స్ సూసైడ్

ఈ ఘటన ప్రొద్దుటూరు మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. ఇడమడకకు చెందిన వినోద్ కుమార్(26) ప్రొద్దుటూరుకు చెందిన యువతిని ప్రేమించాడు. వీళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఈక్రమంలో యువతి ఆగస్ట్ 15వ తేదీని ఉరేసుకుని చనిపోయింది. ఇది తట్టుకోలేని వినోద్ బుధవారం రాత్రి విషం తాగాడు. చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు.
Similar News
News August 22, 2025
చాపాడు PSను తనిఖీ చేసిన జిల్లా SP

చాపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని SI చిన్న పెద్దయ్యను ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News August 22, 2025
కడప జేసీ కీలక ఆదేశాలు

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి సాధించాలని కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047పై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష్యాలను సంపూర్ణం చేయాలని సూచించారు.
News August 22, 2025
సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపండి: కడప కలెక్టర్

వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలవనరులను సంరక్షించుకునే చర్యలను చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు. వర్షా కాలంలో నీటి నిల్వ కారణంగా ఇసుక సేకరణ సాధ్యం కాదని.. ఇప్పటి నుంచే అవసరమైన మేర ఇసుక నిల్వలను పెంచుకోవాలని సూచించారు.