News August 22, 2025

పాలమూరు: వేడుకలు.. విషాదం కావొద్దు

image

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వినాయక వేడుకల సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. మండపాల ఏర్పాటు, విగ్రహాల తరలింపు, ఉత్సవ సభలు, రోడ్లపై అలంకరణలు వంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. SHARE IT

Similar News

News March 19, 2026

వచ్చే నెలలో క్యాబినెట్ విస్తరణ!

image

TG: ఏప్రిల్ తొలి వారంలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించిందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గంలో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్ఠానంతో CM రేవంత్ చర్చించారని సమాచారం. పలువురి శాఖలు మార్చేందుకూ పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తరచూ వివాదాస్పదమవుతున్న మంత్రిపై వేటు పడుతుందని, కొత్తగా లంబాడా నేతకు ఛాన్స్ దక్కనుందని చర్చ సాగుతోంది.

News March 19, 2026

నిజామాబాద్: ‘బ్యాంక్ ఖాతాలు విక్రయం.. ఐదుగురి అరెస్ట్’

image

నిజామాబాద్ జిల్లాలో అక్రమంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఖాతాల ద్వారా మూడు నెలల్లో రూ.31 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇంకా మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానంతో విచారణ కొనసాగుతోంది. ప్రజలు తమ బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని సీపీ హెచ్చరించారు.

News March 19, 2026

ఉగాది ఈవెంట్ సన్నాహాలను పరిశీలించిన కలెక్టర్ డా.లక్ష్మీశ

image

విజయవాడలోని అంబేడ్కర్ కన్వెన్షన్ హాలులో జరగనున్న ఉగాది ఈవెంట్ సన్నాహాలను జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. ఈవెంట్ నిర్వహిస్తున్న AP క్రియేటివిటీ & కల్చర్ కమిషన్ చైర్‌ పర్సన్ పి.తేజస్వి, JC ఇలక్కియకు కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని కళారత్న, ఉగాది పురస్కారాలను ప్రధానం చేయనున్నారు.