News August 22, 2025
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు: చిరంజీవి

పవన్ <<17475204>>బర్త్‌డే విషెస్<<>>కు చిరంజీవి ఎమోషనల్ రిప్లయ్ ఇచ్చారు. ‘తమ్ముడు కళ్యాణ్ నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేనూ అంతే ఆస్వాదిస్తున్నా. నీ వెనుకున్న కోట్లాదిమంది జనసైనికులను ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. నా ఆశీర్వచనాలు నీతోనే ఉంటాయి. ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నా’ అని పోస్ట్ చేశారు.
Similar News
News August 22, 2025
వైద్యశాఖలో 1,623 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TG: రాష్ట్రంలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ ఆస్పత్రుల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇక్కడ <
News August 22, 2025
సంచలనం.. చరిత్ర సృష్టించిన క్రికెటర్

వన్డేల్లో ఆడిన తొలి 4 మ్యాచ్‌ల్లో 50+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే నిలిచారు. AUSతో జరుగుతున్న 2వ వన్డేలో 78 బంతుల్లో 88 రన్స్ చేసి ఈ ఘనత అందుకున్నారు. గతంలో భారత మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ 5 వన్డేల్లో(3వ ODIలో బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు) ఈ ఘనత సాధించారు. మాథ్యూ 4 వన్డేల్లో NZపై 150, PAKపై 83, AUSపై తొలి వన్డేలో 57, 2వ వన్డేలో 88 రన్స్‌తో రికార్డులకెక్కారు.
News August 22, 2025
లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.