News August 22, 2025
విద్యుత్ శాఖ కబడ్డీలో పల్నాడు జట్టు విన్నర్

రాష్ట్రస్థాయి విద్యుత్ శాఖ కబడ్డీ పోటీల్లో పల్నాడు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్ఈ విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబొట్లు, డిప్యూటీ ఈఈ వెంకటేశ్వరరెడ్డితో పాటు క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన జట్టు సభ్యులకు ఎస్ఈ క్రీడా దుస్తులు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ గాంధీతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
గృహ అవసరాల గ్యాస్ వాణిజ్యానికి వాడితే కేసులు: అదనపు కలెక్టర్

గృహ అవసరాలకు కేటాయించిన వంట గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో గ్యాస్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. వాణిజ్య స్థావరాల్లో గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నారా లేదా అన్న అంశంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News March 13, 2026
జగిత్యాల: ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతుల తనిఖీ

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్సీ పరీక్షల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము తనిఖీ చేశారు. పరీక్షల కోసం సిద్ధం చేసిన తరగతి గదులు, తాగునీటి సదుపాయం, వెంటిలేషన్, విద్యుత్ సౌకర్యం, మూత్రశాలల శుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
News March 13, 2026
మెదక్: టెన్త్ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మెదక్ డీఈఓ విజయ తెలిపారు. బాలురు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రూట్లతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలకు ఆధార్ కార్డు ద్వారా మహాలక్ష్మి పథకం కింద ఉచిత సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు భయం వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.


