News August 22, 2025

వరంగల్: భారీ వర్షాలు.. ఈ సూచనలు పాటించండి!

image

ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. కరెంట్ పోల్స్, వైర్లను ముట్టుకోవద్దని సూచిస్తున్నారు. మహిళలు బట్టలు ఆరేసేటప్పుడు ఇనుపతీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఉండొద్దని, తడిగా ఉన్న గోడలను ముట్టుకోవద్దన్నారు. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు పాడి పశువులను వెళ్లకుండా చూడాలన్నారు.

Similar News

News March 19, 2026

సీతారాముల కళ్యాణానికి గవర్నర్‌కు ఆహ్వానం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర గవర్నర్ S.అబ్దుల్ నజీర్‌ను టీటీడీ AEO వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. వారి వెంట ఆలయ ఇన్‌ఛార్జ్ DEO శివప్రసాద్, అర్చకులు ఉన్నారు.

News March 19, 2026

ఆయిల్ టెన్షన్.. ₹10లక్షల కోట్లు ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 2496 పాయింట్లు కోల్పోయి 74,207 వద్ద సెటిల్ అవగా నిఫ్టీ 775 పాయింట్ల నష్టంతో 23,002 వద్ద సెటిల్ అయింది. ₹10లక్షల కోట్లకుపైన ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్రెంట్ క్రూడ్ 118.14 డాలర్లకు, ముర్బాన్ క్రూడ్ 128.84 డాలర్లకు చేరడం మార్కెట్లను కుదిపేసింది. FII సెల్లింగ్, HDFC బ్యాంక్ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపించాయి.

News March 19, 2026

పాలమూరు: గంజాయి కలకలం.. యువకుల అరెస్ట్

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో గురువారం గంజాయి కలకలం రేపింది. మండలానికి చెందిన పలువురు యువకులు హైదరాబాద్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయి కొనుగోలు చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హన్మంత్ రెడ్డి తెలిపారు. ఒక యువకుడు పరారీలో ఉన్నాడు.