News August 22, 2025
కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటివి పూర్తిగా నిషేధమని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
Similar News
News August 24, 2025
పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించాలి: ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆగస్టు నెలకు సంబంధించి అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఆదివారం నెలవారి నేర సమీక్షను తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. గంజాయి కేసుల్లో పాత నిందుతులను కచ్చితంగా రీ విజిట్ చేయాలన్నారు. పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూలు త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు.
News August 24, 2025
బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్, సబ్ జూనియర్ పురుషులు, మహిళలు, బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ జట్లను నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం హై స్కూల్లో ఆదివారం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఈ జట్లు ఈనెల 29 నుంచి 31 వరకు ప్రకాశం జిల్లా చేవూరులో నిర్వహించే అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు ఆలపాటి కాశీ విశ్వనాథం తెలిపారు.
News August 24, 2025
సెప్టెంబర్ 1 నుండి నూతన పాలసీ: రాహుల్ దేవ్

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి వస్తుందని ఏపీ ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. కొత్త పాలసీలో 10% బార్లను కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. బార్లకు లైసెన్స్ ఫీజు తగ్గించడంతో పాటు వాయిదా పద్ధతుల్లో చెల్లింపులకు అవకాశం కల్పించారన్నారు. బార్ల పనివేళలు ఉదయం 10గం: నుంచి రాత్రి 12 గం: వరకు ఉంటాయన్నారు.