News August 22, 2025
పులివెందుల ఉప ఎన్నికపై ఫిర్యాదు

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అక్రమాలు చేసిందని 4వ వార్డు కౌన్సిలర్ పార్లపల్లి కిషోర్ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను అరకు ఎంపీతో కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటర్లను అడ్డుకున్నారని చెప్పారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలు ఓటు వేయనీయకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేశారని. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News August 22, 2025
కడప జేసీ కీలక ఆదేశాలు

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి సాధించాలని కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047పై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష్యాలను సంపూర్ణం చేయాలని సూచించారు.
News August 22, 2025
చాపాడు PSను తనిఖీ చేసిన జిల్లా SP

చాపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని SI చిన్న పెద్దయ్యను ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.