News August 22, 2025

నెల్లూరు: ప్రియుడి వేధింపులు తాళలేక మహిళ సూసైడ్

image

ప్రియుడి వేధింపులు తాళలేక ఓ మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు YSR నగర్‌లో శివలక్ష్మి(34), ఆమె కుమార్తె యక్షిత నివాసముంటున్నారు. సింగరాయకొండ(M) బింగినపల్లికి చెందిన శివకుమార్‌ ఆమెతో నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 20న ఇద్దరి మధ్య విదాదం జరగడంతో శివలక్ష్మి ఊరేసుకుంది. శివకుమార్ వేధింపులే తల్లి మృతికి కారణమని యక్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News March 5, 2026

నెల్లూరు: ఈ నంబర్లు మీ దగ్గర ఉన్నాయా..?

image

వేసవికాలం దృష్ట్యా ప్రజలు ఫైర్ స్టేషన్‌కు సంబంధించిన ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్ 101, నెల్లూరు – 0861 2331051, 9963734284, కావలి – 08626 243101, 9963734286, ఆత్మకూరు – 08627 221222, 9963734394, పొదలకూరు -08621 225202, 9963734828, రాపూరు – 08621 226145, 9963735094, ఉదయగిరి- 08620 229251, 9963735314, వింజమూరు – 08629 214437, 9963735446, మర్రిపాడు- 08620 228800, 9963744817.

News March 5, 2026

నెల్లూరు జిల్లాలో ఘోర విషాదం

image

వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన పాపారావు తన కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి ఇప్పగుంట పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. కోనేరు కుంట వద్ద భోజనం చేసిన తాగునీటి కోసం బావిలోకి దిగిన శ్రీకాంత్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు బావిలోకి దిగిన తండ్రి పాపారావు కూడా ప్రమాదానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News March 5, 2026

నెల్లూరు: హైవేపై ప్రమాదం

image

మనుబోలులోని ఆంధ్ర విలాస్ హోటల్ ఎదురుగా హైవేపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జట్లకొండూరుకు చెందిన పెంచలయ్య ఓ గ్రానైట్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. పని మీద సొంత ఊరు నుంచి మనుబోలుకు బైకుపై వస్తుండగా అదే సమయంలో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పాల ఆటో ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు.