News August 22, 2025

వరంగల్ ఎయిర్‌పోర్ట్.. ఎకరానికి రూ.1.20 కోట్లు జమ

image

TG: వరంగల్ మామునూరు విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34 కోట్లు జమ చేశారు. మొత్తం 253 ఎకరాలను సేకరించనుండగా ఇందుకోసం రూ.205 కోట్లు కేటాయించింది. అటు వ్యవసాయేతర భూమి(ఓపెన్ ప్లాట్లు)కి గజానికి రూ.4వేల వరకు ఇస్తామని ప్రభుత్వం చెప్పగా స్థానికులు ఒప్పుకోవట్లేదు. గజానికి రూ.12వేలు ఇవ్వాలంటున్నారు.

Similar News

News August 22, 2025

రూ.5,000కోట్లు కేటాయించండి: సీఎం చంద్రబాబు

image

AP: ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం(SASCI) కింద రాష్ట్రానికి మరో రూ.5వేల కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను CM CBN కోరారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.2,010CR అందాయని తెలిపారు. అలాగే సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల మేరకు రూ. 250CR విడుదలకు ఉత్తర్వులివ్వాలని కోరారు. కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకానికి త్వరగా విధివిధానాలు రూపొందించి అమల్లోకి తేవాలని సూచించారు.

News August 22, 2025

కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ

image

TG: ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో <<17482025>>విచారణ <<>> జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తదుపరి కార్యాచరణపై హరీశ్ సహా మిగతా బీఆర్ఎస్ నేతలతో గులాబీ దళపతి సమాలోచనలు చేస్తున్నారు.

News August 22, 2025

వైద్యశాఖలో 1,623 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలో 1,623 స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ ఆస్పత్రుల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. SHARE IT.