News August 22, 2025

ASF: లక్కీ లాటరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ASF జిల్లా పోలీసు పరిధిలో గణేష్ నవరాత్రి వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ASF ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు లక్కీ డ్రా, లాటరీలు, బహుమతి పథకాలు వంటివి నిర్వహించరాదన్నారు. లక్కీ డ్రాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లక్కీ లాటరీపై నిషేధం ఉందన్నారు.

Similar News

News March 24, 2026

హనుమకొండ: క్షయ రహితంగా 25 పంచాయతీలు!

image

‘టీబీ ముక్త్ పంచాయతీ’ లక్ష్యంలో భాగంగా జిల్లాలో 25 గ్రామాలను క్షయ రహితంగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా క్షయ నియంత్రణ అధికారి హిమబిందు తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షించి, నిర్దేశిత ప్రమాణాల మేరకు ఈ గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఈ గుర్తింపుతో జిల్లాలో వ్యాధి నిర్మూలన దిశగా మరో ముందడుగు పడిందన్నారు.

News March 24, 2026

అల్లూరి: ‘వచ్చే నెల 3 నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పాలన’

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో ఏప్రిల్ 3 నుంచి పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్స్ పాలనలోకి వెళ్తాయని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్స్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తుందని వెల్లడించారు. అల్లూరి జిల్లాలో 244, పోలవరం జిల్లాలో 186 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్స్‌ను త్వరలో నియమించడం జరుగుతుందన్నారు. మండల స్థాయి అధికారులను నియమించాలని ఆదేశాలు అందాయన్నారు.

News March 24, 2026

HYDలో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదు: CP

image

TG: హైదరాబాద్‌లో ఇంధనం, LPG సిలిండర్ల కొరత లేదని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళనతో బంకులు, ఏజెన్సీల వద్ద క్యూ కట్టి రద్దీ పెంచవద్దని కోరారు. పరిస్థితిని పోలీసులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, వదంతులను నమ్మవద్దని ఆయన ‘X’ వేదికగా విజ్ఞప్తి చేశారు. అందరూ ప్రశాంతంగా ఉండి సహకరించాలని ఆయన సూచించారు.