News August 22, 2025
HYD: గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా? ఇవి కంపల్సరీ

గణపతి నవరాత్రుల్లో మండపాలకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీనుకోవాలి. https://policeportal.tspolice.gov.in/index.htmలో పర్మిషన్‌కు అప్లై చేయండి.
☞ విద్యుత్ కనెక్షన్‌కు డీడీ తీసుకోవాలి
☞ స్వతంత్రంగా కరెంట్ కనెక్షన్ ఇవ్వొద్దు
☞ నిపుణులతో గాలి, వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోండి
☞ స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోండి
☞ అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే పోలీసులకు సమచారం ఇవ్వండి.
Similar News
News August 22, 2025
ఓయూ: సీపీజీఈటీ మొదటి దశ షెడ్యూల్ ఖరారు

సీపీజీఈటీ – 2025లో భాగంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి దశ ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 28వ తేదీన వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 28వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 30వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చన్నారు.
News August 22, 2025
HYD: 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు.. కాపాడిన డాక్టర్లు

వైద్య చరిత్రలో అరుదైన ఘటన ఇది. సిటీకి చెందిన 37 ఏండ్ల వ్యక్తి ఈనెల 16న మానసిక సమస్యతో 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు. కుటుంబీకులు గాంధీ ఎమర్జెన్సీలో చేర్పించారు. జనరల్ సర్జరీ విభాగంలో డాక్టర్లు పేషంట్‌కు వైద్యపరీక్షలు చేసి, ఆహారం ఇవ్వకుండ, మందులు, ప్లూయిడ్స్ ఇచ్చారు. లక్కీగా జీర్ణాశయంలో ఎలాంటి రక్తగాయాలు కాలేదు. మలద్వారం వెంట 7 బ్లేడ్లు పడిపోవడంతో పేషంట్‌ను డిశ్చార్జీ చేసినట్లు డా.సునీల్ తెలిపారు.
News August 22, 2025
కూకట్‌పల్లి: సహస్ర హత్య.. బాలుడు రాసిన పేపర్ ఇదే!

సహస్ర హత్య కేసులో బాలుడికి సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్లాలి? ఏం చేయాలి? అనేదానిపై పూర్తిగా పేపర్ పైన రాసుకొని మరీ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పేపర్‌లో లాస్ట్ లైన్ మిషన్ కంప్లీటెడ్ అని రాసుకొన్న బాలుడి ఆలోచన విధానం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. పదేళ్ల బాలుడి మైండ్‌సెట్ ఇలా ఉండటం పట్ల అంతా నివ్వెరపోతున్నారు.