News August 22, 2025
కొయ్యూరు: టీఏ, కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్

కొయ్యూరు మండలంలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రభాకర్, కంప్యూటర్ ఆపరేటర్ కుమారిని సస్పెండ్ చేశామని డ్వామా పీడీ డీవీ విద్యాసాగర్ తెలిపారు. గతంలో వారు చింతపల్లి మండలంలో విధులు నిర్వహించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపట్టామన్నారు. క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
Similar News
News March 18, 2026
కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడంటే..!

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి 16 మధ్య నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైం టేబుల్, పూర్తి వివరాలకు https://kru.ac.in/ను చూడాలన్నారు.
News March 18, 2026
రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటలు బయటకు రావొద్దు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో ప.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 18, 2026
ఒంగోలు: దివ్యాంగుల సాధికారతకు ‘శక్తి’ పథకం ప్రారంభం

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగుల భరోసా కోసం ‘శక్తి’ పథకాన్ని బుధవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, శిక్షణ, సామాజిక మద్దతు అందించి వారిని స్వయంశక్తితో ఎదిగేలా ప్రోత్సహించనున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని దివ్యాంగుల స్వావలంబనకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.


