News August 22, 2025

తూప్రాన్: వాట్సాప్ లింక్‌తో.. రూ.25 లక్షల మోసం

image

వాట్సాప్ లింక్‌తో వ్యక్తి రూ.25 లక్షలు మోసపోయిన ఘటన తూప్రాన్ మండలంలో జరిగింది. సీఐ రంగకృష్ణ తెలిపిన వివరాలు.. మండలానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌కు వచ్చిన లింక్ ఆధారంగా ఒక నకిలీ షేర్ మార్కెట్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో పెట్టుబడుల రూపంలో దాదాపు రూ.25 లక్షల వరకు జమ చేశాడు. మోసపోయినట్లు గ్రహించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 22, 2025

‘భూమిచ్చిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు: Dy.Cm

image

విద్యుత్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 320 మందికి నియామక పత్రాలు అందజేశారు. ‘ఆనాడు భూములు ఇచ్చింది ఇందిరమ్మే.. ఇవాళ మీకు ఉద్యోగాలు ఇస్తోంది మా ప్రభుత్వమే. 2013లో భూసేకరణ లాంటి గొప్ప చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది. ఆ చట్టంతోనే ఇప్పుడు మీకు న్యాయం చేస్తున్నాం’ అని భట్టి పేర్కొన్నారు.

News August 22, 2025

‘జిల్లాలో 76 వేల హెక్టార్లలో పంటల సాగు’

image

బాపట్ల జిల్లాలో 76 వేల హెక్టార్లలో పంటల సాగు ప్రారంభమైందని వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతి ఏటా ఆగస్టులో చేపట్టే పంటల సాగు కంటే అదనంగా 22,898 హెక్టార్లలో పంటలు వేశారన్నారు. మెట్ట ప్రాంతాల్లో సైతం పంటల సాగు మొదలైందని వివరించారు. 577 మెట్రిక్ టన్నుల ఎరువులు, పురుగు మందులను ఆర్ఎస్కేలలో ఉంచామన్నారు.

News August 22, 2025

ఎవరా లీకువీరుడు..?

image

TG సెక్రటేరియట్‌లో కొందరు హై లెవల్ అధికారులకు టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం.. PC ఘోష్ కమిషన్ రిపోర్టును KCR కోర్టులో సవాల్ చేయడం. కాళేశ్వరంపై ఘోష్ ఇచ్చిన 600పేజీల నివేదికను ప్రభుత్వం ప్రజలకు 60పేజీల సమ్మరీ రిపోర్టుగా రిలీజ్ చేసింది. అయితే KCR 600పేజీల కాపీతో HCకి వెళ్లడంతో ఆయనకు కాపీ ఎవరిచ్చారని CMO విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత IASలు ఆందోళనలో పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.