News August 22, 2025

ప్రకాశం: కొత్త జిల్లాలపై మీరేమంటారు?

image

జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మంత్రుల త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ఎదురుచూస్తున్న ప్రజలకు ఆశలు చిగురించాయి. 30న మంత్రులు సత్య కుమార్, నిమ్మల రామానాయుడు ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు, ఏయే మండలాలు ప్రకాశం, మార్కాపురంలో కలపాలి అనే దానిపై మీ అభిప్రాయాలు చెప్పవచ్చు.

Similar News

News August 23, 2025

ప్రకాశం జిల్లాలో 47200 అర్జీల పరిష్కారం

image

ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన 47200 అర్జీలను పరిష్కరించినట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వివరించారు. ప్రజల అర్జీల పరిష్కారంపై ఒంగోలులోని కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించేలా, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 22, 2025

భూగర్భ జలాలు పెరిగేలా ప్రణాళికల తయారీ: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భూగర్భ జల వనరులశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 20 మీటర్లకంటే ఎక్కువ భూగర్భ జలమట్టం ఉన్న గ్రామాల్లో, జలమట్టం పెరిగే అవకాశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు.

News August 22, 2025

ప్రకాశం: భార్యను గొంతు కోసి హతమార్చిన భర్త

image

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పీవీపురంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. భార్య రామలక్ష్మమ్మను భర్త వెంకటేశ్వర్లు అతి కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.