News August 22, 2025

ఖమ్మం: చెట్టును ఢీకొని వ్యక్తి SPOT DEAD

image

రఘునాథపాలెం మండలం చింతగుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పంగిడికి చెందిన రాందాస్ అనే వ్యక్తి ఖమ్మం నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా అతని బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాందాస్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 13, 2026

హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

image

హార్ముజ్‌ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్‌ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.

News March 13, 2026

వేములవాడలో కార్పెంటర్ ఆత్మహత్య

image

చందుర్తి మండలానికి చెందిన రాజూరి వీరాచారి (45) అనే కార్పెంటర్‌ గురువారం వేములవాడ శివారులోని కోనాయిపల్లెలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్న ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News March 13, 2026

65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు: రేవంత్

image

TG: వైద్యం యాంత్రికంగా ఉండొద్దని, మానవత్వంతో కూడిన చికిత్స అందించాలని CM రేవంత్ అన్నారు. ప్రైవేట్ రంగంలోని డాక్టర్లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలని చెప్పారు. ‘రాష్ట్రంలో 65L మంది హెల్త్ డేటా తయారు చేస్తున్నాం. వాళ్లకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తాం’ అని తెలిపారు. 1.30 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్‌కు చికిత్స పైనా దృష్టి పెట్టామన్నారు.