News August 22, 2025

ఏ క్షణమైనా మాజీ డిప్యూటీ సీఎం అరెస్టు?

image

AP: మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సిట్ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. గతంలోనే నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో తిరుపతి జిల్లా పుత్తూరులోని ఆయన ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ రూపకల్పన సమయంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు.

Similar News

News August 22, 2025

సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు

image

TG: కూకట్‌పల్లిలో సహస్ర మర్డర్ <<17484838>>కేసులో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. అది సహస్ర చూడగా వెంట తెచ్చుకున్న కత్తితో 21 సార్లు పొడిచి చంపాడు. చోరీ ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలి అని పేపర్‌లో ముందే రాసుకున్నాడు. స్థానికుడైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సమాచారంతో పోలీసులు బాలుడిని ప్రశ్నించగా విషయం బయటపడింది. లెటర్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

News August 22, 2025

Dream 11పై బ్యాన్.. BCCI ఏమందంటే?

image

కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్ నేపథ్యంలో భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11పైనా బ్యాన్ పడనుంది. దీనిపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. ‘అనుమతి లేకపోతే స్పాన్సర్‌ను తొలగిస్తాం. కేంద్రం తీసుకొచ్చే ఏ పాలసీనైనా తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం అయ్యే ఆసియా కప్‌లో స్పాన్సర్‌ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.

News August 22, 2025

లిక్కర్ స్కాం.. సిట్ విచారణలో నారాయణస్వామి ఏమన్నారంటే?

image

AP: లిక్కర్ స్కాం కేసులో తనపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దని మాజీ Dy.CM నారాయణస్వామి కోరారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు పుత్తూరులోని ఆయన ఇంట్లో 6గంటల పాటు ప్రశ్నించారు. మద్యం ఆర్డర్స్‌లో మాన్యువల్ విధానం ఎందుకు తీసుకొచ్చారు? తదితర ప్రశ్నలను సిట్ అడిగినట్లు సమాచారం. మద్యం పాలసీలో మార్పుల గురించి తనకేం తెలియదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మిగతా ప్రశ్నలనూ దాటవేసినట్లు సమాచారం.