News August 22, 2025
ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా ప్రభాకర్..?

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌ను ఎన్నుకునేందుకు నిర్ణయించినట్లు సమాచారం. MLA నాగరాజు త్వరలో ట్రస్ట్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. సభ్యులు చిరంజీవి, రేణుక, ఆనందం, కీమా, కుమారస్వామి, పూర్ణ చందర్, వెంకన్న, మహేందర్ రాజయ్య, నర్సింహారెడ్డి, రాజు, బుచ్చిరెడ్డి, వెంకటలక్ష్మి, పాతర్లపాటి రవీందర్ ఉన్నారు.
Similar News
News March 16, 2026
తిరుమల శ్రీవారికి నూతన పరదాల సమర్పణ

ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారికి నూతన పరదాలను సమర్పించారు. బంగారు వాకిలి వద్ద ఉపయోగించే ఈ పరదాలపై నేత్ర దర్శనం, పూర్ణకుంభం, శంఖు–చక్రాలు, తిరునామం, గోమాత, గజవాహనం, మామిడి తోరణాలు, అరటి గెలలు వంటి శుభ చిహ్నాలను ముద్రించారు. ఉగాది సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. పరదాల మణి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ఆలయ అధికారులకు అందజేశారు.
News March 16, 2026
రైతులకు ఉచితంగా యూరియా!

TG: రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ‘రైతు భరోసా’ జాప్యం నేపథ్యంలో యూరియా ఉచిత సరఫరా వల్ల రైతులకు ఒకింత ఊరట, ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత BRS ప్రభుత్వ హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి CM ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలలో దీనిని చేర్చే అవకాశం ఉంది.
News March 16, 2026
పాతపట్నం: రైలు ఢీకొని 29 ఏళ్ల యువకుడి మృతి

పాతపట్నం – తెంబూరు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తు పూరి – గుణుపూర్ రైలు ఢీకొని ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పలాస జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతుడిది ఒడిశాలోని సింగపూర్ గ్రామస్థుడు భివిషాణ్(29)గా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.


