News August 22, 2025
తండ్రికి రామ్ చరణ్ ఎమోషనల్ విషెస్

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కుమారుడు రామ్ చరణ్ ఎమోషనల్ విషెస్ చెప్పారు. ‘నా హీరో, నా గైడ్, నా స్ఫూర్తి మీరే. నేను సాధించిన విజయం, నేను నేర్చుకున్న విలువలు మీ నుంచి పొందినవే. 70ఏళ్ల వయసులో మీరు మరింత స్ఫూర్తిని నింపుతున్నారు. బెస్ట్ ఫాదర్‌గా ఉన్నందుకు థాంక్స్’ అని పోస్ట్ చేశారు. అటు చిరంజీవి బర్త్‌డే నేపథ్యంలో సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News March 20, 2026
ధురంధర్-2 చెత్త సినిమా.. నటి విమర్శలు

‘ధురంధర్-2’పై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే కన్నడ నటి రమ్య స్పందన తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇప్పుడే ధురంధర్-2 సినిమా చూశా. ఇది నా ఓపికకు పరీక్ష పెట్టింది. ఇదో చెత్త సినిమా. బోరింగ్ సబ్జెక్ట్ చదివినట్లు ఉంది. ఈ మూవీ చూసి సమయం, డబ్బులు వృథా చేసుకోకండి. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, BGM, నటన.. ఏవీ బాలేవు. డైరెక్టర్ ఆదిత్య ధర్.. మీ మితిమీరిన జాతీయవాదం, దుష్ప్రచారాన్ని ఆపండి’ అని ట్వీట్ చేశారు.
News March 20, 2026
శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.
News March 20, 2026
ఇంటి పనులను భర్త షేర్ చేసుకోవాలి: సుప్రీంకోర్టు

తన భార్యకు వంట సహా ఇంటి పనులు సరిగ్గా చేయడం రాదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలం మారిందని, ఇంటి పనులను భర్త కూడా షేర్ చేసుకోవాలని పేర్కొంది. ‘మీరు పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు’ అని తెలిపింది. తన పేరెంట్స్‌కు ఆహారం పెట్టడానికి ఆమె నిరాకరించిందని భర్త కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.


