News August 22, 2025
HYD: 42 ఏళ్ల పాలిటెక్నిక్ కాలేజ్ పరిస్థితి ఇదీ..!

రామంతపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇందిరా బ్లాక్ భవనం ప్రమాదకరంగా మారింది. 42 ఏళ్ల చరిత్ర కలిగిన కళాశాలలో అనేక భవనాల పరిస్థితి అధ్వాన స్థితికి చేరింది. ప్రభుత్వ యంత్రాంగం నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ అన్ని భవనాలకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News April 2, 2026
రేపు వడగాలుల ఎఫెక్ట్ ఎక్కడంటే?

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ కడప(D) పొట్టిపాడులో 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. రేపు అల్లూరి, మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 8 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం దాదాపు 58 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News April 2, 2026
జగిత్యాల: విద్యుత్ బకాయిలపై అదనపు కలెక్టర్‌తో చర్చ

గ్రామపంచాయతీలకు సంబంధించిన పెండింగ్ విద్యుత్ బకాయిల వసూలుపై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌ను విద్యుత్ శాఖ అధికారులు కలిశారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ సుదర్శనం బకాయిల జాబితాను అందజేసి, బిల్లులు సకాలంలో చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బకాయిల పరిష్కారానికి సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ గంగారం, ఎస్‌ఏఓ తదితరులు పాల్గొన్నారు.
News April 2, 2026
KNR: నూతన ఆర్థిక సంవత్సరానికి ఘన స్వాగతం

కరీంనగర్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు కేక్ కట్ చేసి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంవత్సరం అభివృద్ధి, పారదర్శకతకు దారితీయాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.


