News August 22, 2025
NZB: సీసీ కెమెరాలపై స్ప్రే.. ATMలో చోరీకి యత్నం

నిజామాబాద్ చంద్ర శేఖర్ కాలనీలో ఈనెల 18న అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అయితే గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేయగా అందులో ఉన్న నగదు కాలిపోయింది. దుండగులు ఏటీఎంలోని సీసీ కెమెరాలపై స్ప్రే చేసి ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Similar News
News August 22, 2025
ఆర్మూర్: ‘ప్రైవేట్ పాఠశాలకు నోటీసులు జారీ చేశాం’

ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు జారీ చేసే ట్రాన్స్‌ఫార్మర్ సర్టిఫికెట్‌కి డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారం ఈరోజు తెలిపారు. ఫీజుల పెండింగ్, టీసీ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News August 22, 2025
ఆర్మూర్: బీజేపీ జిల్లా కార్యదర్శిగా పోల్కం వేణు నియామకం

ఆర్మూర్ పట్టణానికి చెందిన పోల్కం వేణును భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పార్టీ అధిష్ఠానం నియమించింది. పోల్కం వేణు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డ్ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులచారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News August 22, 2025
NZB: రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీకి జిల్లా జట్లు

తెలంగాణ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకు నిజామాబాద్ జిల్లా సీనియర్ మహిళా, పురుషుల జట్లు ఖరారయ్యాయి. ఇటీవల మహిళా, పురుషుల ప్రాబబుల్స్ జట్లకు సన్నద్ధ శిబిరం నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్లు నేటి నుంచి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోలేటిలో జరిగే 71వ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు.