News August 22, 2025
జానపదాల ఖిల్లా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా

జానపద కళలకు, పాటలకు, కళాకారులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కేంద్రంగా నిలిచిందనడంలో సందేహం లేదు. పల్లెల్లో ప్రతి మాటలోనూ, యాసలోనూ ఓ పాట వినిపిస్తుంది. అందుకే ఇక్కడి పాటలు, పల్లె పదాలు ప్రజల మనసులను సులభంగా ఆకట్టుకుంటాయి. జానపదాలతో పేరు ప్రఖ్యాతులు పొందిన వారిలో మధుప్రియ, మౌనిక, మాట్ల తిరుపతి, సుమన్, శిరీష, గడ్డం రమేష్, దిలీప్, శ్రీనిధి వంటి ప్రముఖ కళాకారులు ఉన్నారు.
# నేడు ప్రపంచ జానపద దినోత్సవం
Similar News
News March 14, 2026
టుడే టాప్ స్టోరీస్

* AP రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ డబ్బులు జమ
* మూసీ అభివృద్ధిని అడ్డుకోకండి: CM రేవంత్
* LPG సిలిండర్ల సమస్య పరిష్కారానికి AP, TG ప్రభుత్వాల చర్యలు
* TGSRTCలో సమ్మె సైరన్
* మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్
* దేశంలో ఒక్కరోజే 75లక్షల సిలిండర్ల బుకింగ్స్
* ప్రజలు ఆందోళన పడి సిలిండర్లు బుక్ చేయొద్దు: కేంద్రం
* యుద్ధ ప్రభావంతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
News March 14, 2026
వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్: తుమ్మల

TG: వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్‌లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ క్రమంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్‌లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ పడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
News March 14, 2026
HYD: అనసూయపై అసభ్యకర మెసేజ్‌లు చేసింది ఇతడే!

నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో వేధింపులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జనార్థన్‌ను(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా నగరంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అనసూయ మీద SMలో అసభ్యకరమైన మెసేజ్‌లు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.


