News August 22, 2025
దుకాణాలతో మహిళల ఆర్థిక ప్రగతి: సిరిసిల్ల కలెక్టర్

ఎరువుల దుకాణాల మంజూరుతో మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతాయని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్‌లో మహిళా సంఘానికి కేటాయించిన ఎరువుల దుకాణాన్ని ఆయన శుక్రవారం మహిళలు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్సల్ బేగం, డీఆర్డీఓ శేషాద్రి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News March 25, 2026
పండ్రేగుపల్లి నేత అదృశ్యం సుఖాంతం.. హైదరాబాద్‌లో ఆచూకీ

పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్ పాము సెల్వరాజు <<19470053>>కిడ్నాప్ <<>>కలకలం సుఖాంతమైంది. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఆయన అదృశ్యం కావడంతో కిడ్నాప్‌నకు గురయ్యారనే ప్రచారం జరిగింది. బంధువుల ఫిర్యాదుతో సీఐ వడ్డేపల్లి మురళీ దర్యాప్తు చేపట్టి, సెల్వరాజు హైదరాబాద్‌లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యక్తిగత పనులపైనే వెళ్లానని ఆయన తెలపడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
News March 25, 2026
బొలిశెట్టికి మా పార్టీతో సంబంధం లేదు: జనసేన

బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబందం లేదని జనసేన కార్యలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించి పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలిపింది. కావున బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలకి జనసేన పార్టీకి సంబంధం లేదన్నారు.
News March 25, 2026
జూరాల – ఆత్మకూరు రాకపోకలు బంద్

దిగువ జూరాల జెన్కో యూనిట్ల నుంచి టర్బైన్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేయడంతో గద్వాల – ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉద్ధృతి పెరగడంతో ప్రయాణికుల రక్షణార్థం పోలీసులు బుధవారం రోడ్డును మూసివేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన ఈ దారి మళ్లీ మూతపడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.


