News August 22, 2025
ASF: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్

ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామంలో పనుల జాతర- 2025లో భాగంగా కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కలెక్టర్ వెంకటేష్ దొత్రే, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 100 రోజులుగా సెలవు లేకుండా నిరంతరం పనిచేసిన మున్సిపల్ సిబ్బందిని కలెక్టర్, ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.
Similar News
News August 22, 2025
కడప జేసీ కీలక ఆదేశాలు

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి సాధించాలని కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047పై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష్యాలను సంపూర్ణం చేయాలని సూచించారు.
News August 22, 2025
కోటపల్లి: కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారు: మంత్రి

BRS ప్రభుత్వం కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కోటపల్లి మండలంలో పర్యటించి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత రైతులు బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నారని అన్నారు. మంత్రి ఉత్తమ్‌ను ఇక్కడ జరిగిన వాటిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ జరపాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు కరకట్టలు కట్టాలని మంత్రిని కోరామన్నారు.
News August 22, 2025
2047 నాటికి ‘ఆనంద ఆంధ్రప్రదేశ్’ను సాధిద్దాం: డీఎంహెచ్ఓ

కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో జిల్లా స్థాయిలో 5 సూచికలు, మండల స్థాయిలో 18 అభివృద్ధి సూచికలు ఉన్నాయని, వీటి ప్రగతిని ప్రోగ్రాం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓ డా.శాంతి కళ ఆదేశించారు. శుక్రవారం కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 2047 నాటికి ‘ఆనంద ఆంధ్రప్రదేశ్’ లక్ష్యాలను సాధించేందుకు పనిచేద్దామన్నారు.